Current Date: 06 Oct, 2024

రవితేజ మిస్టర్ బచ్చన్‌ సినిమాపై ట్రోలింగ్ కత్తెరకి డైరెక్టర్ పని

రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్‌పై భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. మాటలు కోటలు దాటితే చేతలు గడప కూడా దాటవన్నట్టుగా హరీష్ శంకర్ తీసిన మిస్టర్ బచ్చన్ దారుణంగా విమర్శలను ఎదుర్కొంటోంది. హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్, తీసిన సీన్స్ మీద విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.మిస్టర్ బచ్చన్ సినిమాలోని కొన్ని సీన్లను జనాలు అస్సలు చూడలేకపోతోన్నారు. హీరో హీరోయిన్ల ట్రాక్.. కొన్ని సిల్లీ సీన్లు. బూతు డైలాగ్స్.. కామెడీ సీన్స్. విలన్ ఇంట్లోని చాలా క్రింజ్ సీన్లను చూసి ఆడియెన్స్ తలపట్టుకుంటున్నారు. ఇక మిస్టర్ బచ్చన్‌ను 13 నిమిషాలు కత్తిరించి కొత్తగా ప్రదర్శించాలని అనుకుంటున్నారట.సోషల్ మీడియాలో మిస్టర్ బచ్చన్ వస్తోన్న నెగెటివిటీ, ట్రోలింగ్‌ను హరీష్ శంకర్ గమనిస్తూనే ఉన్నాడు. పాజిటివ్‌గా ట్వీట్లు వేసే వారికి మాత్రమే హరీష్ శంకర్ రిప్లై ఇస్తున్నాడు. తిడుతూ వేస్తున్న ట్వీట్ల గురించి పట్టించుకోవడం లేదు. ఇలా పొగిడితేనే రిప్లై ఇస్తావా? సినిమా బాగా లేదంటే రిప్లై ఇవ్వవా? బ్లాక్ చేస్తావా? అని నిలదీస్తున్నారు. హరీష్ శంకర్ అలాంటి కామెంట్లకు కూడా రిప్లై ఇచ్చాడు.

Share