Current Date: 25 Nov, 2024

ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు ఇలా రెడీ అవ్వండి.. అంతా హ్యాపీ..!

ఏ అకేషన్‌కైనా డ్రెస్సింగ్ కీ రోల్ పోషిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు సింపుల్‌గా, యూనిక్‌గా కనిపించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.  మనం డ్రెస్సింగ్ ఎంచుకునేటప్పుడే టూ కలర్స్ ఎంచుకోవాలి. అవి కూడా ఎక్కువగా బ్లూకలర్, వైట్ కలర్ వంటి గుడ్ కాంబినేషన్‌ బెస్ట్. జీన్స్ బ్లూ కలర్‌లో ఉంటే షర్ట్ వైట్ కలర్‌లో ఉండాలి.

కొంతమంది బట్టలు కొట్టరు. వాటి క్వాలిటీ గురించి పట్టించుకోరు. మంచి క్వాలిటీ ఐటెమ్స్ తీసుకుంటే కలర్ పోవడం, చిరగడం వంటి సమస్యలు ఉండవు. అదే విధంగా, ఇవి మంచి లుక్‌ని అందిస్తాయి.
​కొన్నిసార్లు ఎంత మంచి క్లాత్‌తో కుట్టినా సరిగ్గా కుట్టకపోతే అది లుక్ ఉండదు. అదే సరైన విధంగా కుడితే అది మీకు మంచి లుక్‌ని అందిస్తుంది.

అదే విధంగా, మీరు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఆర్నమెంట్స్ కాకుండా వాచెస్, కొన్ని ఆర్నమెంట్స్ వేసుకోవచ్చు. ఇవి తక్కువ బరువు ఉంటే మంచిది. అదే విధంగా హెయిర్ స్టైల్ కూడా సింపుల్ అండ్ నీట్‌గా ఉంటే బావుంటుంది. మీ డ్రెస్‌కి సరిపోయే షూ ఎంచుకోండి. సరైన కలర్‌వి ఎంచుకోండి. దీని వల్ల మీ లుక్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది.