ఏ పని చేసినా మీమ్స్, ట్రోల్స్‌తో అసభ్యకరమైన కామెంట్లతో కొందరు నెటిజన్లు చేసే రచ్చ మామూలుగా ఉండటం లేదు. ఇలాంటి నెగటివ్ ట్రోలింగ్‌పై ఎంతో మంది ఎన్నోసార్లు గళం విప్పినా.. ఈ సంస్కృతి మాత్రం ఆగడం లేదు. హీరో హీరోయిన్లు, క్రీడా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు.. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, కామెంట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.చివరికి దేశం కోసం పనిచేసి ప్రాణాలు అర్పించిన కెప్టెన్ కుటుంబంపై కొందరు చేసిన కామెంట్లు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ - ఎన్‌సీడబ్ల్యూ స్పందించింది. సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.దేశం కోసం పోరాడి అమరుడైన కెప్టెన్ అంశుమన్ సింగ్‌ను మరణానంతరం కేంద్ర ప్రభుత్వం.. కీర్తి చక్ర పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డును కెప్టెన్ అంశుమన్ సింగ్ భార్య స్మృతి సింగ్, తల్లి అందుకున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది కెప్టెన్ అంశుమన్ సింగ్ పోరాటాన్ని మెచ్చుకున్నారు.
Share