Current Date: 05 Oct, 2024

విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు అయింది. అప్పటి నుంచి కీలకాంశాలు ఎన్నో పెండిరగ్‌లో ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగినా చాలా విషయాలు కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఉమ్మడిగా ఎజెండా అంశాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ముఖాముఖి భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయి, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండిరగ్‌లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల సమావేశం వేదికైంది. హైదరాబాద్‌లో సమావేశమై రెండు సమస్యలను పరిష్కరించుకుందామని, సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. 

 

Share