తెలంగాణ రాజకీయాలపై కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజున ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ కేటీఆర్’పేరుతో నెటిజన్లతో కేటీఆర్ ముచ్చటించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు, నెటిజన్లు అడుగుతున్న పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. దేశం, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు దారుణంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులను సైతం వదలడం లేదు. పాలిటిక్స్‌లోకి వారిని ఎందుకు లాగుతున్నారో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము ఇలా చీప్ పాలిటిక్స్ చేయలేదు. నా రాజకీయ జీవితంలో నా కుటుంబసభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నాను. కానీ ప్రజల కోసం నిలబడి.. పోరాడాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే నేను ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను. 2025 తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ కొంత సమయం ఇస్తున్నారు. ఇటీవల పార్టీ మారిన పది ఎమ్మెల్యే స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ బీఆర్‌ఎస్ నేతలే విజయం సాధిస్తారని అన్నారు.