ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఒకదానికి భారత జట్టు రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో అతడు ఒక మ్యాచ్‌లో ఆడకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు జరగనున్నాయి. “రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై పూర్తి స్పష్టత లేదు. వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌లోని మొదటి 2 టెస్టుల్లో ఒక మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చు! అదృష్టవశాత్తూ సిరీస్ ప్రారంభానికి ముందు అతడి వ్యక్తిగత సమస్య పరిష్కారమైతే సిరీస్ మొత్తానికి రోహిత్ అందుబాటులో అని బీసీసీఐ తెలిపింది. ఒకవేళ రోహిత్ ఆడకపోతే అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. దేశవాళీ క్రికెట్లో అభిమన్యు ఈశ్వరన్‌కు మెరుగైన గణాంకాలు ఉండటమే అందుకు కారణం. దీంతో యశస్వి జైస్వాల్‌తో కలిసి, అభిమన్యు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.