Current Date: 27 Nov, 2024

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో శ్రీశైలంలో భక్తులు రద్దీ పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. వేకువజాము నుండే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లు, దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. స్వామి అమ్మవారి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఇన్చార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Share