Current Date: 02 Apr, 2025

ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ ఎంపీ చింతామోహన్‌ అన్నారు.  గత ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌ పాలనలో ఎన్నో తప్పులు జరిగాయన్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోతుందనడానికి పోస్టల్‌ బ్యాలెట్లు పడిన తీరే నిదర్శనమన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లతో 99 శాతం వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని చింతామోహన్‌ వ్యాఖ్యానించారు.