Current Date: 26 Nov, 2024

ఎపి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండి వాసుదేవరెడ్డి ఇంట్లో సిఐడి తనిఖీలు

ఎపిలో ఐదేళ్లుగా మద్యం వ్యాపారాన్ని, లిక్కర్‌ డిస్టిలరీ సిండికేట్లను నడిపించారనే అభియోగాలతో ఎపి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఇంట్లో ఎపి సిఐడి తనిఖీలు చేపట్టింది. రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం వాసుదేవరెడ్డిని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ పదవి నుంచి తప్పించింది.ఎపిలోమద్యంధరలనుపెంచడం,ఊరుపేరులేనిమద్యంబ్రాండ్లనువిక్రయించడంలో వేల కోట్ల రుపాయల అక్రమాలు జరిగాయని ఐదేళ్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి వాటిలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే డిస్టిలరీల్లో తయారైన నాసిరకం మద్యాన్ని విక్రయించారని, బాట్లింగ్‌ ధరకు, విక్రయ ధరకు భారీవ్యత్యాసం ద్వారా వేల కోట్లు పక్కదారి పట్టాయని విపక్షాలు ఆరోపించాయి. రాజకీయ పార్టీల ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ వెలువడిన వెంటనే ఎపి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి పై వేటు పడింది.