భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఛాతీ నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇది అత్యవసర పరిస్థితి కాదని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. మంగళవారం ఉదయం దాస్‌కు ఛాతీ నొప్పి రావడంతో పరిస్థితి విషమించి ఆసుప్రతిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అసిడిటీ సమస్యతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.ఈ సాయంత్రమే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అని ఆర్బీఐ ప్రతినిధి తెలిపారు.