తమిళ సూపర్ స్టార్, రాజకీయ నాయకుడు విజయ్ (దళపతి విజయ్) తన భార్య సంగీత స్వర్ణలింగంతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. గత 25 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని, దీనిపై ఏప్రిల్ 20న విచారణ జరగనుందని తెలుస్తోంది. ఈ విడాకులకు ప్రధాన కారణం విజయ్‌కు ఒక హీరోయిన్‌తో ఉన్న వివాహేతర సంబంధమేనని ప్రచారం జరుగుతోంది. సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో తన భర్త ఒక నటితో సన్నిహితంగా ఉంటున్నారని, ఆ విషయం 2021లోనే తనకు తెలిసిందని పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు, విజయ్‌తో కలిసి అనేక హిట్ సినిమాల్లో నటించిన త్రిష కృష్ణన్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా 'లియో' సినిమా తర్వాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే పుకార్లు జోరందుకున్నాయి. విజయ్ ప్రస్తుతం తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' పనుల్లో, తన చివరి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ వ్యక్తిగత వివాదం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ విడాకుల వార్తలపై కానీ, త్రిషతో ఉన్న లింక్‌పై కానీ విజయ్ లేదా త్రిష ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
Share