తెలుగులో ఈగ చిత్రంతో సుపరిచితుడైన కన్నడ నటుడు కిచ్చా సుదీప్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈ విషయాన్ని సుదీప్ కుటుంబ సభ్యులు నిర్ధారిస్తూ సుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆసుపత్రిలో ఉదయం 7గంటలకు కన్నుమూసినట్లుగా తెలిపారు. సుదీప్ తల్లి మరణవార్త తెలుసుకున్న ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. సుదీప్ తల్లి మరణవార్త తెలుసుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్‌కల్యాణ్ తన సంతాపాన్ని తెలియజేశారు.