చంద్రుడిపై పర్వతాలు, లోయలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన అంతరిక్ష పరిశోధకులు తాజాగా మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఉపరితలంపై ఓ భారీ గుహను గుర్తించినట్లు ఇటలీ సైంటిస్టులు తెలిపారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలుమోపిన ప్రాంతానికి దగ్గర్లోనే ఈ భారీ గుహ ఉందని చెప్పారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే ఆస్ట్రోనాట్లకు ఇది ఆవాసంగా ఉపయోగపడుతుందని చెప్పారు. సోలార్ రేడియేషన్, కాస్మిక్ కిరణాల నుంచి ఆస్ట్రోనాట్లకు రక్షణ కల్పిస్తాయని వివరించారు.అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ దిగిన చోటు నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఈ బిలాన్ని గుర్తించామని ఇటలీ సైంటిస్టుల బృందం నిర్ధారించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న నాసా రికన్నైసెన్స్ ఆర్బిటర్ పంపిన రాడార్ మెజర్ మెంట్స్ ఆధారంగా ఈ బిలాన్ని కనుగొన్నామని చెప్పింది. అగ్నిపర్వతం వెదజల్లిన లావా కారణంగా ఈ బిలం ఏర్పడి ఉంటుందని సైంటిస్టులు చెప్పారు.
Share