Current Date: 02 Apr, 2025

ఏపీలో ఉగాది నుంచి కొత్త పథకం...

ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టబోతున్న పీ4 విధానాన్ని ఉగాది పండగ రోజున ప్రారంభించబోతోంది. వెలగపూడిలోని సచివాలయం వెనక భాగంలో భారీ సభ ద్వారా ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకు భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పీ4 విధానం ప్రారంభ సభకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదలను ఆహ్వానిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. 2029 నాటికి ఏపీలో పేదరికం నిర్మూలించాలి అనేదే సంకల్పంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో ఏపీలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పీ4 విధానం అమలు చేయాలని నిర్ణయించారు.

Share