ప్రభాస్ ఇంటి రుచులకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫిదా అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆ వంటకం పేరు ఏమిటో తెలియదు కానీ, ప్రభాస్ ఇంటి నుంచి పంపిన వంటకాలు బాగా నచ్చాయని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'ఎల్ 2 ఎంపురాన్' ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన వంటకాలు చాలా బాగున్నాయని చెప్పిన పృథ్వీరాజ్, తనకు పెసరట్టు, చేపల పులుసు చాలా ఇష్టమని పేర్కొన్నారు.