Current Date: 02 Jul, 2024

అరుదైన ఘనత సాధించిన సుహాస్ ప్రసన్న వదనం...

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ గా వున్నాడు.ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుహాస్ రీసెంట్ గా ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.ఈ సినిమాను దర్శకుడు అర్జున్ వై కే తెరకెక్కించగా మణికంఠ, ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈసినిమాలో రాధాకృష్ణ, రాశీ సింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత ముఖ్య పాత్రలలో నటించారు. మే 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది..ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి.ఇదిలా ఉంటే రీసెంట్ గా సుహాస్ ప్రసన్నవదనం సినిమా ఓటిటిలోకి వచ్చింది.ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి ఓటీటీలో కూడా మంచి స్పందన లభిస్తుంది.ఇదిలా ఉంటే ప్రసన్నవదనం సినిమా ఆహాలో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను ఎంతో ఫాస్ట్ గా క్రాస్ చేసిన సినిమాగా అరుదైన రికార్డు నమోదు చేసింది.