అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ లో ఎస్సెన్సియ ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం సంభవించింది. 40 మంది పైగా కార్మికులు తీవ్ర గాయాలు పాలయ్యారు. క్షతగాత్రులను అచ్యుతాపురం, అనకాపల్లి, విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి తరలించారు. రియాక్టర్ పేలిన ప్రమాదంలో పదిమంది మృతిచెందారు. ఫార్మాలో రియాక్టర్ ఫస్ట్ ఫ్లోర్ బ్లాస్టర్ రెండు ఫ్లోర్లో స్లాబ్ కూల్పోయింది, స్లాబ్ కిందిన ఇంకా ఎంతమంది కార్మికులు ఉన్నారో.. తెలియలేని పరిస్థితి ఈ ప్రమాదంలో కనిపిస్తుందని స్థానికులు వాపోయారు. బుధవారం సాయంత్రం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి పరిశ్రమలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పరిశ్రమల యాజమాన్యంపై ఆగ్రహం.. షిఫ్ట్ వారిగా రికార్డులను తనిఖీలు చేసి ఆరా ఎస్సెన్సియ ఫార్మా పరిశ్రమ వద్ద స్థానిక ప్రజలు, ఇతర కంపెనీల కార్మికులు బారులు తీరారు. వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు దేశంశెట్టి శంకరరావు, లాలం రాము, కోన బుజ్జి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అన్నారు.
Share