టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన వ్యాఖ్యలతో, సోషల్ మీడియా పోస్ట్‌తో టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. తాజాగా “థాంక్యూ గురూజీ.. మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ త్రివిక్రమ్‌పై ప్రశంసల వర్షం కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘ఆదర్శకుటుంబం’ సినిమా షూటింగ్ లొకేషన్లో త్రివిక్రమ్‌ను బండ్ల గణేష్ ప్రత్యేకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతేకాకుండా, గురూజీ ఆరోగ్యం, ఆనందం, విజయాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని మనసారా ప్రార్థిస్తున్నానంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే గతంలో ‘భీమ్లా నాయక్’ సినిమా ఈవెంట్ సమయంలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఓ ఆడియో కాల్ అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ఫంక్షన్‌కు తనను రానివ్వకుండా అడ్డుకున్నది త్రివిక్రమేనని పవన్ కళ్యాణ్ అభిమానితో బండ్లన్న మాట్లాడిన బూతు పదజాలం నెట్టింట వైరల్ అయింది. అలాంటి పాత విభేదాలన్నింటినీ పక్కన పెట్టి, ఇప్పుడు అదే త్రివిక్రమ్‌ను 'గురూజీ' అని సంబోధించడంతో నెటిజన్లు జోక్‌లు వేస్తున్నారు.
Share