జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం ముందుగా జలవనరుల పథకాలపై సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ నిర్వహించారు. జలవనరుల అభివృద్ధికి ప్రతిపాదనలను కోరిన కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. చెరువుల పునరుద్దరణ, చెక్ డ్యామ్ లకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించిన కలెక్టర్. అలెగే సోలార్ ప్లాంట్, కార్తీకవనాల ఏర్పాటుకు భూములను గుర్తించాలని ఆదేశించారు. తోటపల్లి, వెంగలరాయపురం వద్ద సాగర్ పార్కుల ఏర్పాటుకు అంచనాలను రూపొందించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో పాల్గొన్న జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆర్.అప్పలనాయుడు, భూగర్భ జలవనరుల శాఖ అధికారి ఏ.రాజశేఖర్ రెడ్డి, పలు రిజర్వాయర్ల పర్యవేక్షక, ఉప కార్య నిర్వాహకదికారి రాఘు నాయుడు సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు
Share