ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మరో హోరాహోరీ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. అయితే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో అగ్రస్థానంతో సెమీస్‌లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో మ్యాచ్ ను రెండు జట్లు తేలికగా తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం గ్రూప్-ఏ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. భారత్, న్యూజిలాండ్ జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచాయి. ఆదివారం కివీస్ పై భారత్ గెలిస్తే 6 పాయింట్లు భారత్ ఖాతాలో చేరుతాయి. అప్పుడు అగ్రస్థానంతో భారత్ సెమీస్‌లో అడుగుపెడుతుంది.
Share