Current Date: 27 Nov, 2024

దువ్వాడపై సీరియస్ యాక్షన్‌కి వైయస్ జగన్ రెడీ!

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం గత వారం రోజులుగా వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.  గత కొన్ని రోజులుగా దువ్వాడ ఎపిసోడ్ టీవీ సీరియల్ తరహాలో సాగుతూనే వెళ్తోంది. టీడీపీ నాయకులు మధ్యలోకి ఎంట్రీ ఇచ్చి.. దానిపై ఇంకా పెట్రోల్ పోస్తున్నారు. దాంతో వైసీపీ కూడా డిఫెన్స్‌లో పడిపోయింది.దువ్వాడ భార్య, కుమార్తెలు ఒకవైపు తమకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. మరోవైపు దువ్వాడ కూడా మీడియా ముందుకు వచ్చి వారిని తిట్టడంతో దుమారం రేగింది. ఇటీవల విజయసాయి రెడ్డి విషయంలోనూ ఇలానే వ్యవహారం రచ్చకెక్కింది. దాంతో వైసీపీ ఈసారి సీరియస్‌గా రియాక్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.దువ్వాడ కోసం పార్టీని బలి పెట్టడం సమంజసం కాదని  అతడ్ని పార్టీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని వైయస్ జగన్ ఆదేశించే సూచనలు కనిపిస్తున్నాయి. దారికి వస్తే సరే సరి లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి.  వైయస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

Share