విశాఖలో అధికారికంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కలెక్టర్ మల్లికార్జున డుమ్మా కొట్టారు. ఎంవీపీ కాలనీ జీవీఎంసీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి మల్లికార్జున హాజరు కాలేదు. వైసీపీ పాలనలో గతేడాది యోగా దినోత్సవ నిర్వాహణను తన భుజంమీద వేసుకుని నడిపించిన మల్లికార్జున.. ప్రభుత్వం మారడంతో కనబడకుండా పోయారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ప్రధాని మోడీ సైతం యోగా ప్రదర్శనలిచ్చి యోగా ప్రాముఖ్యతపై వివరించారు. ఆరోగ్య భద్రతపై పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆయుష్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమానికి జేసీ మయూర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, అదనపు కమిషనర్ విశ్వనాథన్ మాత్రమే హాజరయ్యారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ విచ్చేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. అయితే జిల్లా యంత్రాంగం చేపట్టిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాకపోవడంపై చర్చనీయాంశమైంది. వైసీపీ హయాంలో అనేక అక్రమాలకు పాల్పడిన కలెక్టర్ మల్లికార్జున తనను రక్షించాలంటూ టీడీపీ నేతల కాళ్లావేళ్లా పడుతున్నారని తెలిసింది.