తిరుమల అంశంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నా జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో తన సోదరుడు నాగబాబును కూడా ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తమ్ముడి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన నాగబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను 'హిందూ ద్రోహి'గా చిత్రీకరిస్తూ తనదైన శైలిలో ఒక ఘాటు వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే, నాగబాబు షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ఊహించని విధంగా స్పందిస్తున్నారు. ఆయన విమర్శలను సమర్థించే వారి కంటే, పాత విషయాలను గుర్తు చేస్తూ విమర్శించే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్ బీజేపీని విమర్శిస్తూ "మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు" అని చేసిన వ్యాఖ్యలను, అలాగే చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో నాగబాబు ప్రవర్తనను నెటిజన్లు కామెంట్స్ రూపంలో ఎత్తి చూపుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా నీతులు చెబుతున్నారంటూ కొందరు నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Share