Current Date: 27 Nov, 2024

డిప్యూటీ సీఎంతో ప్రకాష్ రాజ్ పరువు తీసిన నిర్మాత

తమిళనాడులోని ప్రభుత్వ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ అధికారికంగా పాల్గొన్నాడు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పక్కన కూర్చున్న ఫోటోను షేర్ చేశాడు. ఇక అక్కడి కార్యక్రమంలో మాట్లాడుతూ ఉదయనిధిని పొగుడుతూ పవన్ కళ్యాణ్‌ను విమర్శించాడు. ఉదయనిధి సమానత్వం గురించి మాట్లాడితే.. వేరే వాళ్లు మాత్రం ఇంకేదో మాట్లాడుతున్నారు అని కౌంటర్లు వేశాడు.దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు పెడితే.. దొంగల మనోభావాలు హర్ట్ అవుతున్నాయంటూ ఇలా పిచ్చి వాగుడంతా వాగేశాడు. ఇక ప్రకాష్ రాజ్ మీద తమిళ నిర్మాత మండిపడ్డాడు. ఎనిమీ, మార్క్ ఆంటోని వంటి చిత్రాలను నిర్మించిన వినోద్ కుమార్ తాజాగా ప్రకాష్ రాజ్ పరువుతీశాడు. డిప్యూటీ సీఎంతో ఉన్నాను అంటూ వేసిన ట్వీట్ మీద కౌంటర్లు వేశాడు.వాళ్లంతా ఎన్నికల్లో గెలిచారు  నువ్వు డిపాజిట్లు కూడా దక్కించుకోలేక ఘోరంగా ఓడిపోయావు.. అదే తేడా నీ వల్ల నాకు షూటింగ్ క్యాన్సిల్.. కోటి రూపాయల నష్టం వచ్చింది.. చెప్పకుండా కేరవాన్లోంచి అటు నుంచే అటే పారిపోయావ్. కాల్ చేస్తా అన్నావ్ఇం త వరకు చేయలేదు అంటూ ప్రకాష్ రాజ్ పరువుతీశాడు.

Share