Current Date: 26 Nov, 2024

ఏపీకి తుఫాను గండం.. పొంచి ఉన్న ముప్పు..

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఐఎండీ  తెలిపింది. ఈ నెల 26 నుంచి 28 వరకూ దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని.. 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం నేపథ్యంలో దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కోస్తాంధ్రలోని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పారు. అటు, దక్షిణ కోస్తాంధ్రలో రైతులు అప్రమత్తంగా ఉండాలని.. కోతలు చేపట్టవద్దని, ఇప్పటికే కోతలు కోస్తే పంటలను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వాయుగుండం ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అన్నారు.

Share