భారత్ జట్టు చేతిలో టీ20 ప్రపంచకప్ 2024లో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు.. టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. కనీసం సెమీస్ చేరకుండానే ఆస్ట్రేలియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించడంతో వార్నర్ చాలా ఎమోషనల్‌కి గురయ్యాడు.37 ఏళ్ల వార్నర్ ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టులు ఆడి 44.58 సగటుతో 8,766 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 36 ఫిఫ్టీలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక స్కోరు 335 నాటౌట్ కావడం గమనార్హం.వన్డేల్లో ఇప్పటి వరకు 161 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 45.30 సగటుతో 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియా తరపున టీ20ల్లో 110 మ్యాచ్‌లల్లో 3,277 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.