Current Date: 07 Oct, 2024

బ్రిటీష్ సింగర్‌తో హార్దిక్ డేటింగ్ భార్యతో విడాకులు తీసుకున్న నెలలోనే

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య మళ్లీ ప్రేమలో పడ్డాడు. సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌తో ఇటీవల విడాకులు తీసుకున్న హార్దిక్ పాండ్య.. నెల రోజుల వ్యవధిలోనే మరో అమ్మాయితో రిలేషన్‌‌షిప్ స్టార్ట్ చేసినట్లున్నాడు.  ఆమె కూడా విదేశీయురాలే కావడం గమనార్హం.బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్య డేటింగ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి విహార యాత్రకు వెళ్లినట్లు నిర్ధారించే కొన్ని ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఒకే లొకేషన్‌లో అది కూడా కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరూ పోస్ట్ చేశారు.గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్ వద్ద హార్దిక్ చక్కగా నడుస్తూ కనిపించాడు. అక్కడే జాస్మిన్ వాలియా సైతం ఫొటోలు దిగి.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ పోస్టులకు హార్దిక్, జాస్మిన్‌లు ఒకరినొకరు లైక్ కొట్టారు. దీంతో వీరిద్దరూ కలిసే.. గ్రీస్‌కు వెళ్లారని నెటిజన్లు ఒక తీర్మానానికి వచ్చేశారు.

Share