విశాఖలోని ఎంవీపీ కాలనీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఒక అగ్నిప్రమాదంలో నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారు దగ్ధమయ్యాయి. ఆదివారం అర్దరాత్రి దాటాక ఇక్కడి సెక్టార్-3లోని ఒక అపార్ట్ మెంట్ సెల్లార్ లో ఒక ఎలక్ట్రిక్ వాహనానికి మంటలు వ్యాపించాయి. ఆ
మంటలు అలా అలా పక్కనే ఉన్న వాహనాలకు కూడా అంటుకున్నాయి. కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సీఐ ప్రసాద్ స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపడతామన్నారు.