తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పుకోసమే కొండా సురేఖ నోరు జారినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఈ తరహాలోనే కేటీఆర్‌పై నోరుజారారు.కేటీఆర్‌పై సెలబ్రిటీల వివాహేతర సంబంధాలు ముడిపెట్టి మాట్లాడితే రేవంత్‌రెడ్డి సంతోషిస్తారని సురేఖ అనుకున్నట్టున్నారు. అందుకే కేటీఆర్‌పై సురేఖ అవాకులు చెవాకులు పేలారనే చర్చ జరుగుతోంది. సమంతతో కేటీఆర్‌కు ముడిపెట్టి సురేఖ చేసిన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు కేవలం రేవంత్ కళ్లలో ఆనందం కోసమే అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.సురేఖ కామెంట్స్ ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి బాగా నష్టం కలిగించేలా ఉన్నాయి. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ స్పందించాల్సి వచ్చింది.