Current Date: 04 Jul, 2024

జూ.ఎన్టీఆర్ వాచ్ ధర అంతా? టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా రేటు!

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' మూవీ  షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక ఇటీవల 'టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌'కి ఎన్టీఆర్ గెస్టుగా వచ్చి దేవర సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేతికి ఉన్న కాస్ట్‌లీ వాచ్‌ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.

ఈ వాచ్ 'ఒడొమార్ పిగే రాయల్ ఓక్' బ్రాండెండ్‌కాగా.. దీని ధర 189,000 డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం 
రూ.1.57 కోట్లు ఉంటుందని అంచనా. నిజానికి ఎన్టీఆర్‌కి వాచ్‌లు, కార్లు అన్నా చాలా ఇష్టం. గతంలో కూడా చాలానే కాస్ట్‌లీ వాచ్‌లతో దర్శనమిచ్చారు. స్పోర్ట్స్ వాచ్, కస్టమైజ్‌డ్ వాచ్‌ ఇలా చాలానే కలెక్షన్లు ఎన్టీఆర్ దగ్గరున్నాయి.

దేవర సినిమా మీరంతా కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది. కాస్త లేట్ అయినా సినిమా అందరికీ నచ్చుతుంది అంటూ ఎన్టీఆర్ చెప్పారు. తెలివిగా సినిమాలను ఎంచుకుంటూ ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.