Current Date: 06 Oct, 2024

చంద్రబాబు ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉంటే ?

జెడ్‌ప్లస్‌ కేటగిరి రక్షణ ఉన్న ముఖ్యమంత్రి, సీనియర్‌ నాయకుడి భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం విస్పష్టంగా బయటపడింది. సామర్థ్యం పరిశీలించకుండా, నిబంధనలకు భిన్నంగా 16 ఏళ్ల నాటి హెలికాప్టర్‌ను తెప్పించారు. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాల కాన్వాయ్‌ నుంచి హెలికాప్టర్‌ వరకు ప్రతిదీ పరిశీలించి, సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే వినియోగిస్తారు. కానీ చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్‌ విషయంలో ఉన్నతాధికారుల ఉదాసీనతపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తెచ్చుకున్న హెలికాప్టర్‌కు స్టాండ్‌బైగా ముంబై నుంచి వచ్చిన హెలికాప్టరే పుణె వద్ద ప్రమాదానికి గురైంది.  ప్రతి వెయ్యి గంటలు ప్రయాణం చేశాక దాన్ని సర్వీసు చేయాల్సి ఉంటుంది. హెలికాప్టర్‌ ప్రొవైడ్‌ చేసే జీఎంఆర్‌ సంస్థ సర్వీసు కోసం ముంబైకు పంపింది. సర్వీసు పూర్తి అయ్యే లోపు స్టాండ్‌బై కోసం మరో హెలికాప్టర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే హెలికాప్టర్‌ సామర్థ్యం, పనితీరు అంచనా వేయడంలో అధికారులకు నైపుణ్యం లేకపోవడంతో పాటు నిబంధనలు పాటించలేదనే విమర్శలు వన్నాయి.

Share