Current Date: 04 Jul, 2024

ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఫన్నీ ట్వీట్.. హ్యాట్రిక్ కొట్టేశారు!

ప్రధాని నరేంద్ర మోడీ‌ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ వరుసగా ట్వీట్‌లు వదులుతోంది. ఇప్పటికే నీట్ పరీక్ష బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లు కూలడం ప్రధాని మోడీకి తలనొప్పిగా మారిపోయింది.గత ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లను ప్రధాని మోడీ ప్రారంభించారు. కానీ.. ఇందులో మూడు ఎయిర్‌పోర్ట్‌లు రోజుల వ్యవధిలోనే కూప్పకూలాయి. జలంధర్, ఢిల్లీ, రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లు ఇటీవల భారీ వర్షాలకి దెబ్బతిన్నాయి. దాంతో నరేంద్ర మోడీ హ్యాట్రిక్ అంటూ కాంగ్రెస్ సెటైరికల్‌గా ఓ ట్వీట్ వదిలింది.2014, 2019తో పోలిస్తే 2024లో బీజేపీ మెజార్టీ భారీగా తగ్గింది. మరోవైపు కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. దాంతో అధికారం కోసం పొత్తులపై ఆధారపడిన బీజేపీకి ఈ ఎయిర్‌పోర్ట్‌ల వ్యవహారం పెద్ద ఇబ్బందిగా మారుతోంది. కాంగ్రెస్ కూడా బీజేపీని ఇరుకున పెట్టే ఏ అంశాన్ని జారవిడుచుకోవడం లేదు.

Share