Current Date: 02 Apr, 2025

Amitabh Bachchan bought a place next to Virat Kohli's house

గత 3-4 ఏళ్లుగా  సెలబ్రెటీలు ఎక్కువగా స్థలాలపైన పెట్టుబడి పెడుతుంటారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ వయసులోనూ స్థలాలపైన పెట్టుబడి పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల అయోధ్యలోని సరయూ నదికి సమీపంలో ఉన్న ‘ది సరయు ఎన్‌క్లేవ్‌’లో అమితాబ్‌ బచ్చన్‌ భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

అయోధ్య రామాలయానికి కేవలం 15 నిమిషాలు, అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఈ స్థలం ఉంది. ఇక తాజాగా బిగ్‌బీ మరో చోట కూడా స్థలం కొన్నట్లు తెలుస్తోంది. అలీబాగ్‌లోని 20 ఎకరాల స్థలాన్ని బిగ్‌బీ దాదాపు రూ.10 కోట్లతో కొనుగోలు చేశారని టాక్. అలీబాగ్ ఒక ద్వీపం. ఇప్పటికే అనేక మంది సినీ తారలు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు కూడా కట్టుకున్నారు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇప్పటికే ఇక్కడ ఓ భారీ బంగ్లా ఉంది. ఇప్పుడు అమితాబ్ అక్కడ ఫామ్‌హౌస్‌ను నిర్మించడానికి స్థలం కొన్నారట.

81 ఏళ్ల వయసులో కూడా చాలా ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా సినిమాలు చేస్తున్నారు బిగ్‌ బీ. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ'లో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు.