Current Date: 04 Jul, 2024

కల్కిపై మోహన్ బాబు ట్వీట్.. ఆడేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!

ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. నిన్న ఈ మూవీ చూసిన మోహన్ బాబుచాలా పద్దతిగా ట్వీట్ పెట్టారు. కానీ.. మంచు ఫ్యామిలీ అనగానే ఒంటికాలిపై లేచే ట్రోలర్స్ మోహన్ బాబుని ఓ రేంజ్‌లో ఆరేసుకుంటున్నారు. దానికి కారణంప్రభాస్‌ని బావా అంటూ మోహన్ బాబు చెప్పడమే.‘ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను.. అద్భుతంమహాద్భుతంమా బావ ప్రభాస్‌కి, అమితాబ్‌ బచ్చన్‌ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను’ అంటూ మోహన్ బాబు ట్వీట్ పెట్టారు.‘మా బావ ప్రభాస్‌నా?? ఇదెప్పుడు జరిగిందని ఒకడంటే బావా అన్నందుకు గొల్లున నవ్వుతున్న వీడియోలను షేర్ చేస్తున్నారు ట్రోలర్స్. అయితే అసలు విషయం ఏంటంటే ‘బుజ్జిగాడు’ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్‌లు బావా బామ్మర్దులుగా చేశారు. ఆ చనువుతోనే మోహన్ బాబు ప్రభాస్‌ని బావా అని అనుండొచ్చు.

Share