టాలీవుడ్‌లో మరో కొత్త వివాదానికి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తెరలేపాడు. ఓ సినిమాలో తనని ట్రోల్ చేయడాన్ని తప్పుబడుతూ.. ఆ చిత్ర యూనిట్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ మూవీ పేరు చెప్పలేదు.కానీ. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌లో ఆ సినిమా ప్రొడ్యూసింగ్ హౌస్ ఉందంటూ సంకేతాలిచ్చాడు.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'క' దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయిపోయాడు. ‘‘నాతో మీకేంటి సమస్య? నా గురించి ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారు. ఒకడేమో నేను బాగా డబ్బున్న వాడినని రాస్తాడు. మరొకడేమో రాజకీయ నాయకుడి కొడుకుని అని రాస్తాడు. అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు.కొవిడ్ టైంలో ఎస్ఆర్ కల్యాణ్ మండపం సినిమాతో హిట్ కొట్టాం. కానీ.. ఓ సినిమాలోనూ నాపై ట్రోలింగ్ చేశారు. అసలు అలా చేసేంతలా మీకు నేను ఏం చేశాను? నేను ఎదగకూడదా? నా మీద మీకు ఎందుకు అంత అసూయ?’’ అంటూ కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయిపోయాడు. ఈ ఈవెంట్‌కి వచ్చిన అక్కినేని నాగచైతన్య.. కిరణ్ అబ్బవరం మాట్లాడుతున్నంతసేపు మౌనంగా చూస్తుండిపోయాడు. ఆ తర్వాత అతనికి మద్దతుగా నిలిచాడు.