విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్ ) సీఎండీ బాధ్యతల్ని మోయిల్ సీఎండీ అజిత్ కుమార్ సక్సెన కు అప్పగిస్తూ ఉక్కు మంత్రిత్వ శాఖ ఉత్తరువులు జారీ చేసింది. నవంబర్ లో పూర్తి స్థాయి సీఎండీ పదవీ బాధ్యతల్ని తీసుకోవలసి ఉండగా ఇప్పుడు ఆకస్మాత్తుగా సక్సెన ను సీఎండీ గా నియమించడం పట్ల ఉక్కు భవిష్యత్తు పై అనుమానాలు రికేత్తుతున్నాయి. సక్సెన గతం లో విశాఖ ఉక్కు డైరెక్టర్ (ఆపరేషన్స్ ) పని చేశారు. ఆయన హయాం లోనే ఉక్కు లోని ఒక బ్లాస్ట్ ఫర్నెసు ను మూసివేయడం జరిగింది.. ఆనాటి నుంచే విశాఖ ఉక్కు కష్టాల్లో పడింది. ప్లాంట్ మొత్తం ఈ ఉన్నతాధి కారిని అన్ సక్సె్నా అని పిలిచేవారు. అటువంటి అధికారికి కేంద్రం విశాఖ ఉక్కు బాధ్యత లను అప్పగించడం పై నిరసన వ్యక్తం అవుతోంది.