Current Date: 02 Apr, 2025

again on Anasuya's 'Aunty' comments.. Harsh reply!

బుల్లితెర యాంకర్ అనసూయ మరోసారి రచ్చకెక్కింది. ఓ నెటిజన్​ తన గురించి ట్విట్టర్ వేదికగా కామెంట్ చేయగా, దానికి అనసూయ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. "మిమ్మల్ని ట్రోల్‌ చేసేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారు?" అని ఓ నెటిజన్ అడగ్గా, దానికి కూడా ఆమె గట్టిగా ఆన్సర్ చెప్పింది. "ట్రోలర్స్‌ అంటే వికారమైన జీవులు. వాళ్లకు ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిదని నేను తెలుసుకున్నాను. వాళ్లకు ఏదో ఒకటి చెప్పి నా టైమ్‌ వేస్ట్‌ చేసుకోవాలని అనుకోవడం లేదు" అని బదులిచ్చారు.

అనసూయ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల 'రజకార్‌' మూవీలో పోచమ్మగా నటించింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు 'పుష్ప2'లో దాక్షాయణిగా అలరించేందుకు సిద్ధమవుతోంది. ట్రోలర్స్, నెటిజన్లతో గొడవపడటం అనసూయకి ఇదేమీ తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఆమె నెటిజన్లపై ఘాటు విమర్శలతో విరుచుకుపడింది.

నెటిజన్స్ అనసూయ ఆంటీని కామెంట్ చేస్తుండటంతో.. నేను మీకు ఆంటీ కానేమో. అయినా మీ ఇంట్లో ఒకసారి అడగండి. మీకు తెలియకుండా రిలేషన్స్‌ ఉన్నాయేమో. ఎందుకంటే చుట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయని నాకు మా పెద్ద వాళ్లు నేర్పించారు. ఏదేమైనా మీకు అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.