Current Date: 08 Feb, 2026

లోక్‌సభలో బెల్ట్‌తో ఇరుకున పడిన బీజేపీ.. ఎంపీ కవర్ చేసుకున్నా బుక్!

లోక్‌సభలో బడ్జెట్‌ గురించి చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ, విదేశీ వస్తువుల కంటే దేశీయ వస్తువులకే (స్వదేశీ) ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్ఘాటించారు. అయితే, అదే సమయంలో ఆయన సుమారు 80,000 విలువైన లూయిస్ విట్టన్ అనే అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్‌కు చెందిన బెల్టును ధరించి అనురాగ్ ఠాకూర్ సభలో కనిపించడం వివాదానికి దారితీసింది. ఆయన  బెల్టు కెమెరాకు చిక్కడంతో, వెంటనే తన కుర్తాతో దానిని కప్పి ఉంచడానికి ప్రయత్నించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు, నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవైపు సామాన్య ప్రజలకు, పేద హిందూ కుటుంబాల పిల్లలకు స్వదేశీ వస్తువుల వాడకం గురించి, మతాన్ని కాపాడుకోవడం గురించి హితబోధ చేసే నాయకులు, తాము మాత్రం విదేశీ బ్రాండెడ్ వస్తువులను వాడుతున్నారని విమర్శిస్తున్నారు. "నీతులు చెప్పేందుకే కానీ, పాటించడానికి కాదు" అనే విధంగా బీజేపీ నాయకుల తీరు ఉందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అనురాగ్ ఠాకూర్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. పేదలు మతం కోసం రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చే నాయకులు, తమ పిల్లలను మాత్రం విదేశాల్లో చదివిస్తూ, తాము లక్షల విలువైన విదేశీ వస్తువులను ధరిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. స్వదేశీ నినాదం కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.