Current Date: 05 Oct, 2024

రిస్క్ అయినా ఫిక్స్ అయితే ఇక బాలయ్య వినడు బి.గోపాల్

నందమూరి బాలకృష్ణని ఫ్యాక్షన్ సినిమాలతో తిరుగులేని మాస్ హీరోగా తెరపై చూపించిన దర్శకుల్లో బి.గోపాల్ ముందు వరుసలో ఉంటారు. టాలీవుడ్‌లో బాలయ్యతో అత్యంత సన్నిహిత డైరెక్టర్లలో ఒకరైన గోపాల్.. బాలయ్య గురించి ఆసక్తికర విషయాల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఎన్టీఆర్ వారసుడు అయినా కూడా కష్టపడే గుణం బాలయ్యలో ఎక్కువ. లంచ్ తర్వాత అరగంట పాటు రెస్ట్ తీసుకునే అలవాటు బాలకృష్ణకు ఉంది. కానీ క్యార్ వ్యాన్‌లోకి వెళ్లకుండా చెట్టు కింద మంచం వేసుకుని పడుకునేవారు. రౌడీ ఇన్‌స్పెక్టర్ సినిమాలో ఓ కీలకమైన సన్నివేశంలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి లారీపైకి దూకాలి. బాలయ్య ప్లేస్‌లో డూప్‌ను పెట్టాలని అనుకున్నా. కానీ అతను వినలేదు. నేనే చేస్తానంటూ ముందుకు వచ్చారు. వద్దు బాబు.. అని చెప్పినా వినలేదు. నేను చేస్తా అని.. రిస్క్ అయినా చేసేశాడు. బాలయ్య ఏదైనా చేయాలని ఫిక్స్ అయితే ఇక అంతే ఎవరు చెప్పినా వినడు.. రిస్క్ అయినా చేసేస్తాడంతే. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమాలోనూ గుర్రం మీద నుంచి రైడ్ చేసుకుంటూ వచ్చి గ్లాస్ పగలగొట్టాలంటే.. డూప్ లేకుండా బాలయ్యే చేశాడు. టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది ఇలా రిస్క్ షాట్స్ చేస్తారు.

Share