ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 256ని విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో నిరుద్యోగులను తమ బుట్టలో వేసుకునేందుకు హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీని విడుదల చేస్తామంటూ టీడీపీ కూటమి ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపైనే తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో పాత డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.