భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సంచలన నిర్ణయం తీసుకుంది. జిమ్నాస్టిక్స్‌కు దీపా రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. రిటైర్మెంట్ తర్వాత కర్మాకర్ కోచ్‌గా లేదా మెంటార్ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.2011 నేషనల్ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించడంతో కర్మాకర్ ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. ఆ తర్వాత ఆసియన్ గేమ్స్‌లోనూ గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆసియన్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా నిలిచింది.2016 రియో ఒలిపింక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని ఆమె చేజార్చుకుంది. అయినప్పటికీ అప్పట్లో దేశం మొత్తం ఈ జిమ్నాస్టిక్ వెంట నిలిచింది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలను కర్మాకర్ గెలిచింది. కానీ.. ఈ ఏడాది పారిస్ ఒలిపింక్స్‌కి ఆర్హత సాధించడంలో 31 ఏళ్ల దీపా విఫలమైంది.