పాఠాలు చెప్పాల్సిన విద్యార్థులతోనే ఓ టీచర్ రాసలీలలకు దిగింది. అంతేకాకుండా ఈ ఘటనలోనే ఆమె జైలుకు కూడా వెళ్లింది. అయినా సరే బుద్ధి లేకుండా బెయిల్‌పై బయటికి వచ్చి మరో విద్యార్థితో ఎఫైర్ పెట్టుకుంది. అది కాస్తా గర్భం దాల్చే వరకు వెళ్లింది. దీంతో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆ విద్యార్థుల వయసు 15 ఏళ్లే కావడం గమనార్హం. 30 ఏళ్ల ఆ టీచర్ ఇద్దరు విద్యార్థులతో సంబంధం పెట్టుకుని చివరికి అడ్డంగా దొరికిపోయింది.
బ్రిటన్‌కు చెందిన రెబక్కా జాయ్‌నెస్ అనే 30 ఏళ్ల మహిళా టీచర్ ఈ తతంగం మొత్తం నడిపింది. మొదట తాను పాఠాలు చెప్పే ఓ 15 ఏళ్ల బాలుడితో సంబంధం పెట్టుకుంది. 2021 లో ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత ఆ బాలుడిని షాపింగ్‌కు తీసుకెళ్లి.. 345 పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.36 వేలు పెట్టి బెల్ట్ కొనిచ్చింది. ఆ తర్వాత అతడికి మాయమాటలు చెప్పి బాలుడితో శృంగారం చేసింది. ఈ విషయాన్ని ఆ బాలుడు తన ఫ్రెండ్‌కు మెసేజ్ చేసి చెప్పాడు. అంతేకాకుండా వారిద్దరూ ఏకాంతంగా ఉన్న ఫోటోను కూడా పంపాడు. ఈ విషయం బయటికి రావడంతో ఆమెపై కేసు నమోదైంది. బాలుడితో శృంగారం చేసిన ఘటనలో రెబక్కా జాయ్‌నెస్ జైలుకు కూడా వెళ్లింది. ఆ తర్వాత ఆ కేసులో రెబక్కా జాయ్‌నెస్‌కు బెయిల్ లభించింది.
అయినప్పటికీ బుద్ధిగా ఉండకుండా మరో బాలుడిని లైన్‌లో పెట్టుకుంది. స్నాప్ చాట్‌లో పరిచయమైన మరో బాలుడికి తన ఫోటోలు పంపి రెచ్చగొట్టింది. ఎట్టకేలకు ఆ బాలుడిని తన లైన్‌లోకి తెచ్చుకున్న రెబక్కా జాయ్‌నెస్ తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లడం ప్రారంభించింది. ఆ తర్వాత వారిద్దరూ శృంగారం చేసుకోవడంతో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. దీంతో ఈ విషయం కాస్తా బయటికి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి 6 కేసులు రెబక్కా జాయ్‌నెస్‌పై నమోదయ్యాయి. కానీ తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని రెబక్కా జాయ్‌నెస్ మాంచెస్టర్ కోర్టుకు తెలిపింది. రెండో బాలుడికి 16 ఏళ్లు నిండిన తర్వాతనే తాను శృంగారంలో పాల్గొన్నట్లు తెలిపింది. ఈ సంఘటనతో రెబక్కా జాయ్‌నెస్‌ను సదరు పాఠశాల సస్పెండ్ చేసింది.