జగన్ హయాంలోనే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. లడ్డూలకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్‌లో నిర్ధరణ అయిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. మళ్లీ తప్పు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షురాలిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను లేఖ రాసినట్లు తెలిపారు. లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరామన్నారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె స్పందించారు. డిక్లరేషన్ రూల్ అందరికీ వర్తిస్తుందన్నారు. ‘‘రూల్స్ అప్లైడ్ ఫర్ ఆల్ పీపుల్’’ అని వ్యాఖ్యానించారు.