Current Date: 05 Oct, 2024

యాంకర్‌ సుమపై ఇంటర్వ్యూలో కోప్పడిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ జయాపజాయలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసేస్తున్నారు. స్క్రీన్‌పైనే కాదు.రియల్ లైఫ్‌లో కూడా అంతే ఎనర్జిటిక్‌గా, జోవియల్‌గా రవితేజ ఉంటారు. ఎంతమంది ఎన్ని రకాలుగా విసిగించినా, కోపం తెప్పించాలని ట్రై చేసినా మాస్ రాజా మాట మాత్రం నార్మల్‌గానే ఉంటుంది. కానీ రవితేజ తొలిసారి కోపం తెచ్చుకున్నారు. సీనియర్ యాంకర్ సుమపై ఫైర్ అయ్యారు. ఈ వీడియోను బయట పెట్టింది. రవితేజకి అత్యంత ఆత్మీయుడైన డైరెక్టర్ హరీష్ శంకర్. ఇంటర్వ్యూలో సుమతో అడిగిన ప్రశ్నకి కథ మొత్తం చెప్పేయేలా అంటూ రవితేజ కోప్పడినట్లు ఉంది. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ సుమకి ఇంటర్వ్యూ ఇవ్వగా వింటేజ్ రవితేజను మిస్టర్ బచ్చన్‌లో చూస్తారంటూ హరీష్ శంకర్ అన్నారు కదా ఎలాంటి వింటేజ్ వెంకీ లాంటిదా, విక్రమార్కుడా, ఇడియట్  ఇలా ఏ వింటేజ్ అంటూ సుమ అడిగింది. ఈ ప్రశ్నకి హరీష్ శంకర్ వింటేజ్ అంటూ వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చారు రవితేజ. కానీ సుమ ఊరుకోకుండా మీ ఇద్దరి కాంబోలో రెండు చిత్రాలు వచ్చాయి కదా.షాక్, మిరపకాయ్ ఇందులో ఏ వింటేజ్ అంటూ మళ్లీ అడిగింది సుమ. 

 

Share