భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించడంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. స్వామివారి మెట్టుమార్గాన్ని మూసివేసింది. ఈ నేపథ్యంలోనే టీటీడీ భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంది. భక్తుల వసతి, దర్శనాలకు ఇబ్బంది కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. కొండచరియలపై నిఘా పెట్టి, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటోంది. ఇక వర్షాల నేపథ్యంలో శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను టీటీడీ అనుమతించడం లేదు.