టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోకి ఎంట్టర్ కాగానేఅభిమానుల ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో రోహిత్ ప్రపంచ కప్ ట్రోఫీని పైకెత్తి చూపుతూఅభిమానులకు అభివాదం చేశాడు. ఎయిర్ పోర్ట్ నుంచి భారత్ క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్ కు చేసుకున్నారు. హోటల్ వద్ద కూడా భారత్ క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. 'హోటల్ ఎంట్రన్స్ లో కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. డోల్ వాయింపుకు కళాకారులతో కలిసి హార్దిక పాండ్య స్టెప్పులు వేశాడు. బస్సులోంచి దిగిన విరాట్ కోహ్లి హార్దిక స్టెప్పులకు నవ్వులు పూయించాడు. నవ్వుకుంటూ హోటల్ లోనికి వెళ్ళిపోయాడు.
Share