అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల సెగ ఇంకా కొనసాగుతోంది. రోజు వ్యవధిలోనే ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నప్పటికీ, నాగార్జున మాత్రం ఇప్పటికీ వెనక్కు తగ్గడం లేదు. కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశాడు. ఈ కేసును విచారణకు స్వీకరించిన నాంపల్లి స్పెషల్ కోర్టు, ఇప్పటికే నాగార్జున స్టేట్ మెంట్‌ను రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసును 23వ తేదీకి వాయిదావేసింది. నాగార్జున ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిందిగా మంత్రిని ఆ నోటీసులో కోర్టు పేర్కొంది. ఒకవైపు నాగార్జున ఫైట్ చేస్తుండగా.. మరోవైపు అనూహ్యంగా కొండా సురేఖపై కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేశారు. సుమంత పర్సనల్ లైఫ్‌ను తనకి ముడిపెట్టడంపై కేటీఆర్ ఈ కేసు వేశారు. బాల్క సుమన్, దాసోజు శ్రవణ్ సాక్ష్యులుగా చేరారు. దాంతో కాంగ్రెస్‌కి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారబోతోంది