పూణే వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక జట్టు న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 113 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో 2012 తర్వాత భారత్ స్వదేశంలో తొలి టెస్ట్ సిరీస్‌ను కోల్పోయినట్టు అయింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో 360 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మినహా ఎవరూ 50కి పైగా స్కోర్లు చేయలేకపోయారు. జైస్వాల్ వేగంగా ఆడి కేవలం 65 బంతుల్లోనే 77 పరుగులు బాదాడు. తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో జైస్వాల్ ఒక ప్రత్యేక రికార్డును సాధించాడు. 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే క్యాలెండర్ ఏడాదిలో 30కి పైగా సిక్సర్లు బాదిన తొలి భారతీయ బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 2024లో జైస్వాల్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన మూడు సిక్సర్లతో కలుపుకొని ఈ ఏడాది మొత్తం అతడి సిక్సర్ల సంఖ్య 32కి పెరిగింది.