హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు ఓకే విడతలో పోలింగ్ జరుగుతుంది. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి రెండు గంటల్లో 9.53 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రజలు పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో రెండు పతకాలను గెలుచుకున్న మనుబాకర్ మొదటిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రaజ్జర్‌లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి ఓటు వేశారు. తమ నేతలను ఎన్నుకునే బాధ్యత యువతగా మనపైనే ఉందని అన్నారు. ఈ చిన్న అడుగులే భవిష్యత్తులో భారీ లక్ష్యాలను సాధించేందుకు మార్గాలని అన్నారు.