ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలోకి అనుమతి లేకుండా వెళ్లిన సీఐపై బదిలీ వేటు పడింది. పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉన్నప్పుడు.. మంగళగిరి టౌన్ సీఐ శ్రీనివాసరావు అనుమతి లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పవన్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు చేస్తున్నారు. దాంతో కొద్దిసేపు ఆగమని భద్రతా సిబ్బంది సీఐకి చెప్పినా వినలేదు.సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఐ బూట్లతో వెళ్లొద్దని చెప్పినా పట్టించుకోకుండా అలానే లోపలికి వెళ్లిపోయారు. దాంతో డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే సీఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం నుంచి సీఐ వినోద్‌కుమార్‌ను నియమించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు.గతంలో కూడా సీఐ శ్రీనివాసరావుపై జనసేన ఆరోపణలు చేసింది.ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఉండే అపార్టుమెంట్‌లోకి వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడంతో బదిలీ వేటు పడింది.
Share